10-02-2025 04:58:34 PM
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఫైర్...
అబ్దుల్లాపూర్ మెట్: మణిపూర్ హింసకు బిజెపి పార్టీ కారణమని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ అన్నారు. వీరు గుల్జార్ సమాధి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవ నారాయణ దేవాలయాన్ని అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపెల్లి గ్రామంలో నిర్మించారు. సోమవారం దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మణిపూర్ హింసకు బిజెపి, నరేంద్ర మోడీ కారణమని ఫైర్ అయ్యారు. అదేవిధంగా మణిపూర్ లో ఇరువురుగాల మధ్య జరుగుతున్న ఘర్షణలో వేలాదిమంది నిరాశయులు అయ్యారన్నారు. జాతుల వైర్యానికి చరమగీతం పాడుతూ అల్లలను అదుపు చేసి కాంతినిలో కలిపే దిశగా కృషి చేయాలని అన్నారు. అలాగే ఇప్పటికైనా మణిపూర్ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి మోడీ సందర్శించి.. బాధితులకు అండగా నిలిచి.. శాంతి బద్ధత చర్యలు చేపట్టాలని కోరారు.
హింసాకు ప్రేరేపిస్తున్న అల్లరి అల్లరి మూకలు పట్ల కఠిన చర్యలు చేపట్టి.. ఘర్షలను అదుపు చేయాలన్నారు. ప్రధాని మోడీకి అధికార దాహం తప్ప.. ప్రజల కోసం పట్టడం లేదని ఎద్దేవా చేశారు. జతుల మధ్య జరుగుతున్న దాడుల వలన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని... ఇకమీదట ఇలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను మణిపూర్ కు తరలించి.. శాంతి నెలకొల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర మహేందర్ గౌడ్, ఎండి గౌస్ పాషా, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.