- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు ఏమైంది?
- కాంగ్రెస్ లబ్ధి కోసమే కులగణన
- బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. అసలు కులగణననపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా ఆని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ..
21 హామీలు నెరవేర్చకుండానే ఇప్పుడు కులగణన పేరుతో కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారంబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమ లు చేయడం లేదని ప్రశ్నించారు. కోర్టు కేసుల పేరిట బీసీ రిజర్వేషన్లను పెంచకుండా తప్పించుకునే ఈ ప్రభు త్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కులగణనపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
రాహుల్ గాంధీ కులం ఏది?
కులగణన గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్‌గాంధీకి లేదన్నారు. ఆయనది ఏ కులం, మతం ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ కులం, మతం, వారసత్వం బయటపెట్టకుండా కులగణన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ కూడా రేవంత్‌రెడ్డి డైవర్ష న్లో పడ్డారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కుల గణనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.