calender_icon.png 25 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర

25-02-2025 01:59:39 AM

ఫోన్ ట్యాపింగ్ నిందితులను భారత్‌కు ఎప్పుడు తెస్తారు?

బీఆర్‌ఎస్ కుంభకోణం కేసుల ఫైళ్లను ఈడి తీసుకెళ్లింది 

బీజేపీ పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తోంది 

నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నిజామాబాద్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి):  రిజర్వేషన్లపై డిఆర్‌ఎస్ బిజెపి కుట్రపల్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని గతంలో జరిగిన జనగణన కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జన గణన స్పష్టంగా ప్రజల ముందు ఉంచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమవారం నిజామాబాదులో ఆయన ప్రసంగించారు. అమెరికా ప్రభుత్వం ఒకవైపు పక్క డాక్యుమెంట్లతో వెళ్లిన విద్యార్థులను సంకెళ్లు వేసి తిరిగి పంపిస్తుంటే ఫోన్ టాపింగ్ నిందితులో ఎందుకు భారత్కు రాలేకపోతున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ టాపింగ్ నిందితులు ప్రభాకర్ రావు సవన్ భారత్‌కు ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఆయన కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ నిందితులపై కేసులు నమోదు చేసి వారిని కటకటాల వెనక్కి పంపాలని మేము ప్రయత్నిస్తుంటే ఫోన్ టాపింగ్ నిందితులకు బీజెపి పరోక్షంగా మద్దతూ ఇస్తోందని బీజేపీ పరోక్షంగా వారిని కాపాడుతూ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ రేస్ స్కాం కేసు గొర్రెల స్కామ్ కేసుతో పాటు టిఆర్‌ఎస్ గవర్నమెంట్ లోని ప్రాజెక్టుల కుంభకోణాల కేసు ఇలా ఫైల్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి తీసుకెళ్లిందని ఇప్పటివరకు ఆ కేసులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కామ్ లో కేసులకు సంబంధించిన ఫైలు ఈడి తీసుకెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వం ఏమి స్థితిలో ఉందని ఇదంతా బిఆర్‌ఎస్ పార్టీకి పరోక్షంగా బిజెపి మద్దతు ఇవ్వడంతో టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీసీల జన గణన నిక్కచ్చిగా జరిపామని 56.33% బీసీలు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలిపారు. బడ్జెట్ తో తెలంగాణను బిఆర్‌ఎస్ కు అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని కేసీఆర్ చేసిన ఏడు లక్షల 50 వేల కోట్ల అప్పుకి కప్పం కడుతూనే ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ అప్పుకి 75 వేల కోట్లు ఇప్పటివరకు వడ్డీ చెల్లించామని ఆయన తెలిపారు.

కెసిఆర్ పాలనలో ఉన్నప్పుడు ఉద్యోగులకు జీతం రాలేదని ఆర్థిక వ్యవసాయ కూర్చి ౧వ తేదీని కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇస్తోందని రిటైర్డ్ ఉద్యోగులకు బకాయ ౮ వేల కోట్ల వివిధ ఆర్థిక సమస్యలు పెళ్లిళ్లు  తీరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు ఇప్పటివరకు బకాయి వెయ్యి కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖచిత్రంలో బీఆర్ ఎస్ పార్టీ కనబడకుండా పోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారు అన్నారు.

నిరుద్యోగంతో ఉన్న యువతకు 56 వేల ఉద్యోగాలు ఇచ్చినా ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. 15వేల పోలీసు ఉద్యోగాలు 6 వేల మెడికల్ సిబ్బంది  55163 ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం  చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని తమకు ఓటు వేసి గెలిపించితేనే ప్రభుత్వానికి పట్టబదులకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలను తీర్చే విధంగా నరేందర్ రెడ్డి పాటుపడతారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాదులో మెట్రోతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన తెలిపారు.