calender_icon.png 6 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినలో బీజేపీ హవా!

06-02-2025 01:21:53 AM

ఆప్‌కు ఎదురుదెబ్బ?

27 ఏండ్ల తర్వాత ఢిల్లీలో కమలం గుబాలింపు

 కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటే!

పోలింగ్ శాతం : 58.2%

ఎగ్జిట్ పోల్స్

యమున వాటర్ వార్ ఆప్‌ను రక్షించలేకపోతోందా.. ఉచిత పథకాలు కూడా గట్టెక్కించడం లేదా.. ఢిల్లీ ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకుంటున్నారా.. అంటే అవుననే చెపుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్న మాట ఒక్కటే.. ఈసారి ఢిల్లీలో  కమల వికాసం కన్ఫామ్ అని.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోనుందని అవి జోస్యం చెప్పాయి. హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న ఆప్‌కు ఈసారి ఎదురుదెబ్బ తప్పదని ఘంటాపథంగా పేర్కొన్నాయి.

ఒకప్పుడు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈ సారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితంకాక తప్పదని తెలిపాయి. గతంలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన రెండు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదన్నది గమనార్హం. ఓట్ల లెక్కింపు 8న జరగనుంది.