calender_icon.png 15 November, 2024 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు బీజేపీ అనుకూలమే

11-11-2024 12:53:23 AM

ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపట్టిన కులగణనకు బీజేపీ ముమ్మాటికీ అనుకూలమేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీసీల పట్ల ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే పనిచేసిందని దుయ్యబట్టారు. ఆ పార్టీకి బీసీలంటే ఏమాత్రం పట్టింపు లేదని విమర్శిం చారు. ఇదే విషయాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ పేర్కొన్నారని గుర్తు చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో బీసీలకు ఆ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలును పక్కదారి పట్టించేందుకు హైడ్రా, మూసీ ప్రక్షాళనను ముందే సుకున్నారని విమర్శించారు. కులగణన ద్వారా ఏఏ అంశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కులగణన సర్వేలో అనవసర అంశాలను చేర్చి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ లక్ష్మణ్‌పై విమర్శలు మాని బీసీలకు మేలు చేసే అంశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించాలని హితవు పలికారు. లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.