06-03-2025 05:41:59 PM
ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నం..
గజ్వేల్ లో బిజెపి విజయోత్సవ సంబరాలు..
గజ్వేల్: తెలంగాణలో బిజెపి పార్టీ బలపడుతుందని, మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను గెలిపించి బిజెపి పార్టీపై ఉన్న నమ్మకాన్ని ప్రజలు మరోసారి వెల్లడించారని బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ లు అన్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలు విజయం సాధించిన సందర్భంగా గురువారం గజ్వేల్ లో బిజెపి నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పట్టభద్రులు, మేధావులు బిజెపి పార్టీతో దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని వారి ఓటు వేసి మరోసారి ప్రజలకు తెలిపారన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు అసత్య ఆరోపణలు చేసిన తెలంగాణ ప్రజలు బిజెపి వెళ్తే నిలబడ్డారన్నారు. 14 నెలల కాంగ్రెస్ పార్టీ కుతంత్ర పాలనను తిరస్కరించి పట్టభద్రులు మేధావులు బిజెపికి అండగా నిలబడ్డారన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ సాయి బాబా, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, మనోహరబాద్ మండల బిజెపి అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, గజ్వేల్ సీనియర్ నాయకులు నాయిని సందీప్ కుమార్, మాడ్గురి నరసింహా, రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.