- లగచర్ల ఘటనలో అక్రమ కేసులు ఎత్తివేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సిరిసిల్ల, నవంబర్ 19 (విజయక్రాంతి): బీజేపీ హిందూత్వ సిద్ధాంతం కేవలం అంబానీ, అదానీల కోసమేనని, యువతరాన్ని బీజేపీ మతోన్మాద మత్తులో ముంచుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వహించిన సీపీఎం మూడో సభలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2021 నాటికి పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తూ, చట్టం చేస్తామని ప్రకటించి, రైతు మెడలో ఉరితాలు వేసే మూడు వ్యతిరేక చట్టాలు బీజేపీ తెచ్చిందని వీరభద్రం మండిపడ్డారు. బీజేపీ ఆడుతున్న మతోన్మాద దుష్ట పన్నాగాలను ప్రజలు తిరస్కరించాలన్నారు.
దేశ సమైక్యత, మతసామరస్యం కోసం ప్రజలు ఐక్యంగా నిలబడాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్, స్కైలాబ్, కూరపాటి రమేష్, మూషం రమేష్, ఎరవెల్లి నాగరాజు, ఎల్లారెడ్డి, కోడం రమణ, జవ్వాజి విమల, శ్రీధర్, పద్మ, ప్రశాంత్ పాల్గొన్నారు.