పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): భూదందాలకు కేంద్ర బిందువు బీజేపీ అని పీసీసీ మీడి యా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రమం త్రులు కిషన్‌రెడ్డి, బండి తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. మంగళవారం గాంధీభ వన్ లో మాట్లాడుతూయంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేస్తే బీఆర్‌ఎస్ ఓర్చుకోలేపోతుందని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికాలో పర్యటిస్తున్నారని, గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా విదేశీ పర్యటన చేశారా? అని ప్రశ్నించారు.