calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ విలువలను బిజెపి కాల రాస్తుంది

27-03-2025 09:16:44 PM

కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి..

కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి.. 

హుజురాబాద్ (విజయక్రాంతి): ఏ రాజ్యాంగంతో బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో, ఆ రాజ్యాంగాన్ని బిజెపి నాయకులు అవమానపరుస్తున్నారని వరంగల్ కూడా చైర్మన్  వెంకట్రామిరెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు లు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్  పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో గురువారం పట్టణ, మండల, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏఐసీసీ పిలుపుమేరకు ఏఐసీసీ పిలుపుమేరకు ఏప్రిల్ మూడవ తేదీ నుండి రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర పేరుతో దేశం మొత్తంలో గ్రామ గ్రామాన గడపగడపకు నిర్వహించబోతుందని తెలిపారు.

ప్రతి కార్యకర్త బిజెపి చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బి అంబేద్కర్ ని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అమీషా క్షమాపణ చెప్పాలని లేని యెడల కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పత్తికృష్ణారెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొలిపాక శంకర్, సొల్లు బాబు, తాళ్లపల్లి రమేష్ గౌడ్ తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.