calender_icon.png 26 December, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ

17-09-2024 05:24:44 AM

సీపీఎం నాయకుల ఫైర్ 

ఆదిలాబాద్/కామారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో నిజాం పాలనకు, రాజాకార్లు, దేశ్‌ముఖ్, భూసాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతా ంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ మతాల మధ్యన జరిగిన పోరాటంగా వక్రీకరించి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నదని సీపీఎం నాయకులు మండిపడ్డారు. తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాట వారికోత్సవాల్లో భాగంగా సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదరి  దరనాల మల్లేష్ ఆధర్యంలో సోమవారం ఆదిలాబాద్లో బైక్ ర్యాలీ నిర్వహించారకు.

ఈ సందర్బంగా దరనాల మల్లేష్ మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ ఎ త్తుగడలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాయుధ పోరాటం భూ మి కోసం, భుక్తి కోసం జరిగింది పోరాటం తప్పా హిందూ, ముస్లింల మధ్య జరిగినది కాదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నా రు. తెలంగాణ సాయుధ రైతాంగ వార్షికోత్సవం సందర్భంగా కామారెడ్డికి చెందిన ప ణిహారం రంగాచారి చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.