11-04-2025 01:06:25 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో తిరుగులేని శక్తిగా బిజెపి అవతరించిందని, భవిష్యత్తు అంతా బిజెపిదేనని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్ రూరల్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చామనపల్లి గ్రామంలోని గందె రామారావు కళ్యాణ మండపంలో క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది.
ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి ఎక్కడుందన్న గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, బిజెపి ఏంటో కెసిఆర్ కు తెలిసి వచ్చిందని, నేడు కెసిఆర్ ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన కూడా బిజెపి సత్తా ఏంటో తెలిసి వచ్చేలా చేస్తామని, అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాండ్ల గోపాల్, గూడెం శ్రీనివాస్, గుర్రం కమలాకర్ రెడ్డి, మాదాసు శివరామకృష్ణ, శ్రీనివాస్, సునీల్, శేఖర్, యుధిస్టర్ శ్రీనివాస్, శంకరయ్య, అమరేందర్, రమేష్, సాయి, శ్రీకాంత్, సంజీవ్, శ్రీనివాస్, రాజు, హరీష్, వినయ్ రవి, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.