calender_icon.png 13 February, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

13-02-2025 10:42:25 AM

బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదు

కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి

బీసీలకు కాంగ్రెస్ మరింత అన్యాయం

హైదరాబాద్: బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు(BC Reservations Implementation) చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదన్నారు.

బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గుతాయని వివరించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ( Congress party) మరింత అన్యాయం చేస్తోందని కేంద్రమంత్రి సూచించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో(local elections) పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు రావాని తెలిపారు. నిధులు రావాని తెలిసినా.. స్థానికసంస్థల ఎన్నికలను జాప్యం చేస్తున్నారని బండి సంజయ్(Bandi Sanjay Kumar) ఆరోపించారు.