calender_icon.png 25 November, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపఎన్నికలో బీజేపీ అవకతవకలు

25-11-2024 02:47:39 AM

ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్

లక్నో, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని కుందర్కి ఉపఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ ఆరోపించారు. నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట అని, పోలిం గ్ రోజు వందలాది మంది ఓటర్లను ఓటు వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యాయం కోరేందుకు, బీజేపీపై ఫిర్యా దు చేసేందుకు లక్నో వస్తున్న ఓటర్లను సీతాపూర్‌లో  పోలీసులు అడ్డుకున్నారని, వారిని అరెస్ట్ చేయడం దుర్మా ర్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 20న కుందర్కిలో ఉపఎన్నిక జరగగా, బీజేపీ అభ్యర్థి రాంవీర్ ఠాకూ ర్ 1.4 లక్షల మెజార్టీతో విజయం సాధి ంచారు. ఆయన గెలుపుపై అనుమానాలు ఉన్నాయని, కొందరిని ఓట్లు వేయకుండా చేసి బీజేపీ గెలిచిందని ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు.