ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, జూలై 15 (విజయక్రాంతి): జిల్లాలో ఇప్పటికే రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక లోకసభ స్థానం గెలుచుకుని బీజేపీ బూత్‌స్థాయి నుంచి బలోపేతమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీదే పైచేయి అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. శ్రావ్య గార్డెన్స్‌లో సోమవారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గత మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ 28 మునిసిపల్ డివిజన్లను కైవసం చేసుకున్నదని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, నాయకులు కులచారి దినేష్, నాయకులు పల్లె గంగారెడ్డి, లోక భూపతిరెడ్డి, వెంకటరమణి, న్యాలం రాజు, గద్దె భూమన్న, స్రవంతీరెడ్డి పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు చెక్కులు..
కార్యకర్తలకు బీజేపీ అండగా నిలుస్తుందని ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం అర్వింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఇటీవల మృతిచెందిన 21 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.8.80 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కార్యకర్తలకు భరోసానిచ్చేందుకు 2021లో బుత్‌స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 186 మంది కార్యకర్తల కుటుంబాలకు సాయం చేస్తామన్నారు.