calender_icon.png 21 April, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఎంపీల వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు

21-04-2025 01:56:08 AM

ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వద్దని పార్టీ నేతలను ఆదేశించిన నడ్డా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజే పీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే న్యాయవ్యవస్థ తీరును తప్పుబడుతూ తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దినేశ్ శర్మ కూడా ఇదే తర హా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా తీవ్రంగా స్పందించారు. ఆ ఎం పీల వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెపా ్పరు.

‘న్యాయవ్యవస్థ ప్రధాన న్యాయమూర్తిపై బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబం ధం లేదు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. బీజేపీ ఆ వ్యాఖ్యలతో ఏకీభవించదు. న్యాయవ్యవస్థపై బీజేపీకి అపార గౌరవం ఉంది. బీజేపీ రాజ్యాంగ రక్షణకు బలమైన స్తంభం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.