గద్వాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టం పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత అన్నారు..టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బడ్జెట్?లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైకరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సరితమ్మ నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి ప్రభుత్వ దష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అభివద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదని,తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింద న్నారు..తెలంగాణ అభివద్ది కోసం కేంద్రం ఆలోచన చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఆయా స్థాయిల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల మహిళా, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..