16-04-2025 01:23:21 AM
దుబ్బాక ఇంచార్జి చెరుకు శ్రీనివారెడ్డి
చేగుంట ఏప్రిల్ 15, విజయక్రాంతి ; చేగుంట పట్టణ కేంద్రంలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్ర ము గింపు కార్యక్రమం అధిష్టానం నియమించిన కో ఆర్డినేటర్లు జనగామ మల్లారెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహాత్మ గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం అంటే యావత్ దేశ ప్రజలను అవమానపర్చినట్లేనని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు, దేశంలో బిజెపి అసమర్ధ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.