calender_icon.png 18 April, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో బలమైన శక్తిగా మారిన బీజేపీ

10-04-2025 12:43:49 AM

ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్

ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా మారిందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు బుధవారం బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముషీరాబాద్‌కు చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు జమాల్ పూరి ఆధ్వర్యంలో భరత్ నగర్, శివాలయం చౌరస్తా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను సదానంద్ ముదిరాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సదానంద ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా మారిందని,  బీజేపీతోనే సుస్థిర పాల న సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలు కంకర బద్ధులై ఉన్నారని పేర్కొన్నారు. అందువల్లే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలన్నారు.

బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు జమాల్ పూరి నందు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ జెండా ఎగురవేసి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలను సద్విని చేసుకునేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీ రాబాద్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు బద్రి నారాయణ, బీజేవైఎం నాయ కులు అనిల్ కుమార్, అజయ్ గుప్తా, ఆయుష్, డివిజన్ నాయకులు మెట్టు వాసు, లక్ష్మణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.