హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు భారతీయ జనాతా పార్టీ(Bharatiya Janatha Party) శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది. అందులో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. నల్గొండ, ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి(Sarotham Reddy), కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అభ్యర్థిగా మల్క కొమరయ్య(Malka Komaraiah)ను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సి. అంజిరెడ్డి(Anji Reddy) పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాల విడుదల చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చింది. అధిష్టానం తమ పేర్లను ప్రకటించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.