06-03-2025 06:50:20 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యల విజయాన్ని పురస్కరించుకుని అంబేద్కర్, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించి బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.... బీజేపీ కి ఓటు వేసి గెలిపించిన టీచర్లకు, గ్రాడ్యుయేట్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, సామ వెంకటరమణ, సీనియర్ నాయకులు రమేష్ జైన్, నరేష్ జేన్, తమ్మినేని శ్రీనివాస్, గురువయ్య, కోమాకుల రవి, ముష్కం గంగన్న, బొక్కనపెల్లి సతీష్, మంద రాజేందర్, వేణుగోపాల్, తగరపు గంగయ్య, వేముల మధు, కానగంటి మల్లయ్య, బొప్పు కిషన్, బుద్ధి సిద్ధార్థ, సమరసింహ, బిజెపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు