calender_icon.png 22 April, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

07-04-2025 12:00:00 AM

  1. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటి పక్షులు 
  2. మోదీపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారు
  3. ఎంఐఎం పార్టీ నేతలు ఆడే ఆటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పావులు
  4. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ 

ముషీరాబాద్/వారాసిగూడ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న విశ్వాసంతో ప్రజలు బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయ న ధీమా వ్యక్తం చేశారు.

ఈ మేరకు  ఆదివా రం బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం లోని  కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్, ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్  డివిజన్లో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కె. లక్ష్మ ణ్ మాట్లాడుతూ...

ఇటీవల హరియానా, ఢిల్లీ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, అందుకు మోదీ అవినీతిరహిత పాలన కొనసాగించడమే నిదర్శనం అన్నారు. దేశ చరిత్రలోనే మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్రమోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకంతోనే బీజేపీని గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.

పేద  ముస్లింలకు, ముస్లిం మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో  వక్ఫ్ బిల్లును సరిదిద్దడానికి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిల్లును వ్యతిరేకిం చాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని కేవలం రాజకీయ లబ్దికోసమే పార్లమెంటులో వక్ఫ్ బిల్లును అడ్డు కునేందుకు యత్నించారని ఆరోపించారు.

ఎంఐఎం పార్టీ నేతలు ఆడే ఆటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పావులుగా మారారని విమర్శించారు. హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ నేతలు హైదరాబాద్‌లో ముస్లీంలు పేదరికంలో మగ్గుతు న్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ ఎంఐఎం పార్టీ నేతలే అని, మరి పేదరికంలో ఉన్న ముస్లిం ల అభ్యున్నతికి ఎందుకు కృషిచేయడంలేదని ప్రశ్నించారు

. ప్రధాని నరేంద్రమోదీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉంటూ బీజేపీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  

ముషీరాబాద్, కవాడిగూడలో 

గాంధీనగర్, రాంనగర్, కార్పొరేటర్ లు సుప్రియా నవీన్ గౌడ్, రచన శ్రీ, పావని వినయ్ కుమార్, రవి చారి, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, రాష్ట్ర నాయకులు జి. వెంకటేష్, పరిమళ కుమార్, ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రమేష్ రామ్, జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, ఆర్. విశ్వం, రాజశేఖర్, దిలీప్ యాదవ్, మహేందర్ బాబు, ప్రభాకర్, బీజేవైఎం నాయకులు అనిల్ కుమార్, కుషాల్ గౌడ్, అజయ్ గుప్తా, సురేష్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జమాల్ పురి నందు, వాసు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వారాసిగూడ ప్రధాన కూడలిలో..

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. వారాసిగూడ ప్రధాన కూడలిలో ఆ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బౌద్ధనగర్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్, ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపరిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమం లో సుబ్బారావు, సంపత్, సురేష్ దత్త, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.