calender_icon.png 21 April, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

07-04-2025 12:00:00 AM

పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం 

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్6( విజయ క్రాంతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు తో కలసి ధోని శ్రీశైలం పార్టీ జెండా ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగిల మల్లికార్జున్ యాదవ్,పార్టీ మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటురీ జయరాజ్, నాయకులు ప్రసాద్ గౌడ్,దీపక్ రావ్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.