calender_icon.png 9 March, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం

07-03-2025 12:34:31 AM

పెబ్బేరు, మార్చి 6: భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెబ్బేరు బీజేపీ పట్టణ అధ్యక్షులు క్రాంతి కుమార్ నాయుడు అన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సిగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సిగా అంజిరెడ్డి అఖండ విజయం సాధించిన సందర్భంగా గురువారం పెబ్బేర్ మున్సిపల్ కేంద్రం సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణి చేసి సంబరాలు జరుపుకున్నరు.

ఈ సందర్భగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత ముటకట్టుకున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వెస్తున్నదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెబ్బేరు మున్సిపాలిటీనీ కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.