calender_icon.png 22 April, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ

12-04-2025 12:22:55 AM

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్ 11,(విజయ క్రాంతి) కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బిజెపి విస్తరించిందని కామారెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిబండారు నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారంభారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ బీజేపీ 46 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 16 వ వార్డులో గావ్ చలో - బస్తీ చలో  అభియాన్ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదా రులను కలవడం జరిగింది. స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్ర మం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ము ఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని, ప్రస్తుతం కేంద్రం లో మూ డవ సారి అధికారంలోకి రావడమే కాకుం డా, 12 రాష్ట్రాల్లో స్వంతగా అధికారంలో ఉండి, మరో 6 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉందని అన్నారు.

దేశంలో దాదాపు మూడవ వంతు భూ భాగం లో బీజేపీ అధికారంలో ఉందని 2 సీట్లతో  ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో బీజేపీ విస్తరించిదంనీ ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడై పని చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు వేణు, భరత్, నరేందర్, విజయ్, ప్రవీణ్, భూమేష్, నేహాల్, వసీం, రాజేష్, రాజ్ గోపాల్, శ్రీనివాస్,పాల్గొన్నారు.