07-04-2025 12:45:16 AM
జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్
సిద్దిపేట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో 46వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా బిజెపి జెండాను ఎగరవేసిన జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూచిట్టచివరి పేదల సంక్షేమమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచరణగా ఆర్థిక, సాం స్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా సర్వస్ఫర్శి - సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూ లల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా, దేశహితం కోసం పనిచేస్తున్న ఘనత బిజెపి కార్యకర్తలకే దక్కిందన్నారు. ప్రతి కార్యకర్తకి, నాయకులకు, మద్దతుదారులకు జిల్లా అధ్యక్షులుగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరవేయడం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంగ రాంచంద్ర రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూది శ్రీకాంత్ రెడ్డి, కొత్తపల్లి వేణు గోపాల్, గుండ్ల జనార్ధన్, బందారం కనకరాజు, తడుపునూరి వెంకట్, కేమ్మ సారం సంతోష్, బొడ్డు సునీల్, మహిళా నాయకురాలు పద్మ, తమ్మిశెట్టి వీరేశం, శివ కుమార్, వరప్రసాద్, కాసన గట్టు సంతోష్, సుతారి కార్తీక్, కనకరాజు, శ్రీనివాస్ , ఎయిర్టెల్ వెంకట్,భోగి శ్రీనివాస్, కొండూరి మహేష్, అభి, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.