06-04-2025 03:33:51 PM
బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు
హుజురాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే వెన్నుముకలని బీజేపీ పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ కామ మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరంలో స్థాపించారని అప్పుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈరోజు కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా బిజెపి పార్టీ ఏర్పడిందన్నారు. 21 రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, భారతదేశానికి పద్ధతిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన దాటి నుండి ఇప్పటివరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, భరోసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్థిక సంస్కరణలు, భారతదేశ రక్షణ దేశ భద్రత విషయంలో ముందుడడం హర్షనీయమన్నారు. రైతుల సంక్షేమం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాషా జెండా ఎగరడానికి నాయకులు కార్యకర్తలు క్రిష్ చేయాలని అన్నారు.