calender_icon.png 7 April, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-04-2025 05:18:33 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 1980 సం,,లో ఆవిర్భవించిందన్నారు. నాటి నేటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ ముందుకు దూసుకు పోతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ ధారవేణి రవికుమార్, బిజెపి గ్రామ అధ్యక్షులు దశరథం గౌడ్, నాయకులు దుర్గం మల్లేష్ లు పాల్గొన్నారు.