06-04-2025 05:18:33 PM
మందమర్రి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఆదివారం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు డివి దీక్షితులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 1980 సం..లో ఆవిర్భవించిందన్నారు. నాటి నేటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ ముందుకు దూసుకెళ్తు ప్రపంచ దేశాలే భారత్ వైపు చూసేలా బిజెపి పరిపాలన కొనసాగుతుందన్నారు. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్యాల రాజమల్లు, కట్ల తిరుపతి, రోడ్డ మోహన్, మండల నాయకులు బొడ్ల భూపతి, రంగు శ్రీనివాస్, కోలేటి శివ, కే వినయ్, సప్పిడి నరేష్, పారిపెళ్లి శ్రీనివాస్, పిల్లి శంకర్, ఎస్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.