06-04-2025 02:26:56 PM
చెన్నూర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆది వారం పట్టణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జెండాను పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి నాయకులతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా జాడి తిరుపతి మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై ఇవాళ భారతదేశంలో మూడవసారి గెలిచి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రిత్వ బృందంతో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందంటే అది బీజేపీతోనే అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, ఆవిర్భావ వేడుకల కన్వీనర్ కేవీఎం శ్రీనివాస్ రావు, చెన్నూరు పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీపాల్, పట్టణ ఉపాధ్యక్షులు కైత రాజేశ్వర్, మాణిక్ రౌత్ శంకర్, కార్యదర్శిలు బొజ్జ పోచన్న, కొత్తూరు దుర్గాప్రసాద్, దాసరి రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు మద్ద మధు, పట్టణ బూత్ అధ్యక్షులు తోట సాయికుమార్, మానిశెట్టి మహేష్, సతీష్, రాస మల్ల సంతోష్, ఎడ్ల స్వరూప రాణి, కర్ని వెంకట్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.