06-04-2025 02:33:04 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ భారతీయ జనతా పార్టీ జెండా (బీజేపీ)ను ఎగురేశారు. ఈ సందర్భంగా దార కళ్యాణి మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వ్యవస్థాపకులను కార్యకర్తలు చేసిన త్యాగాలని స్మరించుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తుందన్నారు.