calender_icon.png 18 April, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

''ఊరికి వెళ్దాం బస్తీకి పోదాం" జయప్రదం చేయండి

09-04-2025 08:11:54 PM

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఊరికి వెళ్దాం బస్తీకి పోదాం అనే కార్యక్రమాలను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు. బుధవారం బిజెపి ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా తాండూరు మండలంలో బిజెపి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామానికి బిజెపి గురించి, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని అన్నారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో బిజెపి కార్యకర్తలు గ్రామ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, మండల అధ్యక్షులు భరత్ కుమార్, సీనియర్ నాయకులు తుకారాం, మహీధర గౌడ్, సురేష్, మల్లేష్, పుట్ట కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.