calender_icon.png 19 April, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-04-2025 12:23:35 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 6 : బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులు, శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ ఆవిర్భవించిన ప్పటి నుంచి దేశం, ప్రజల కోసం పనిచేస్తున్న తీరును వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, తెల్లాపూర్, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.