06-04-2025 12:42:37 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అర్చన టెక్స్ చౌరస్తా వద్ద బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, ఎనగందుల కృష్ణ మూర్తి, అమిరిశెట్టి రాజ్ కుమార్, బియ్యాల సతీష్ రావు, కర్రె లచ్చన్న, తోట మల్లికార్జున్, వేముల దుర్గా ప్రసాద్, బెల్లంకొండ మురళి, రాజమౌళి, శివ తదితరులు పాల్గొన్నారు.