12-04-2025 10:18:39 PM
చిలుకూరు: భారతీయ జనతా పార్టీ 45వ, ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో మండల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, కొండ శ్రీను, ముక్క ఎల్లయ్య, రాంబాబు, వెంకటి, సుదర్శన్, చారి, సతీష్, మహేష్, విద్యాసాగర్, మనీ, నవీన్ పాల్గొన్నారు.