calender_icon.png 17 April, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పల్లెకు బిజెపి

08-04-2025 04:22:08 PM

మందమర్రి (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా ఈ నెల 10,11,12 తేదీలలో పల్లె పల్లెకు బిజెపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిజెపి సీనియర్ నాయకులు తెలిపారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో మండల క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10,11,12 తేదీలలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గావ్ చలో కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటించి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో పది మంది ఇతరులు సభ్యులతో కూడిన కమిటీని నియమించి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. బీజేపీ మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, జిల్లా నాయకులు అక్కల రమేష్, దేవరనేని సంజీవరావ్, బీజేవైఎం మండల అధ్యక్షులు పెంచాల రంజిత్, వంజరి వెంకటేష్, ధారవేణి రవికుమార్, కర్రే రాజయ్య, దుర్గం మల్లేష్, రాజేష్ నాయక్, ఎనగందుల చిరంజీవి, చిందం కుమార్, మారిశెట్టి సదానందం, ఓడ్నాల రమేష్, రాచర్ల మహేందర్, దశరథం గౌడ్, బానోత్ శీను, మంద శ్రీనివాస్, సిద్ధం శ్రీనివాస్, మారుతి, దుర్గం రాజయ్య, రామటెంకి అశోక్, నీలం రాజ్ కుమార్, కందూరి రాజయ్య, కడియాల అశోక్ లు పాల్గొన్నారు.