25-03-2025 04:01:50 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ దృష్టి కోణం అంశంపై మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యశాల ( వర్క్ షాప్) లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఒబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు మాట్లాడుతూ... వార్డు సభ్యుని నుండి ప్రధాని మంత్రి ఎన్నిక వరకు అన్ని ఎన్నికలు దేశ వ్యాప్తంగా కొన్ని రోజుల వ్యవధిలో ఒకే సారి నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి కోట్ల రూపాయల ఆర్థిక భారం తప్పుతుందని అన్నారు. మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కొవిద్ వారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ కూడా జమిలీ ఎన్నికల ద్వారా దేశం ఆర్థికంగా, రాజకీయంగా, ఎంతో ఉపయోగకరం అని నివేదిక అందజేసిందని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విషమలో కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.