calender_icon.png 7 April, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో రెపరెపలాడిన బీజేపీ జెండా

06-04-2025 04:37:53 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదేవపూర్ మండలంలోని మునిగడప, గొల్లపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలతో సహా మండల వ్యాప్తంగా నాయకులు  భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు గుర్రం శ్రీధర్ పటేల్ మాట్లాడుతూ... దేశమే ముందు ఆ తర్వాతే దేహమైన కుటుంబమైన అనే సిద్ధాంతంతో అంత్యోదయమే లక్ష్యమై, వికసిత భారతమే ధ్యేయమై, జాతీయ వాద భావనలతో జాతీయ సమైక్యత పట్ల నిబద్ధతతో ప్రగతిశీల దృక్పధంతో ప్రజాస్వామ్య పద్ధతులతో లౌకికవాదాన్ని ఆలంబనగా చేసుకొని, రాజ్యాంగ స్ఫూర్తిగా అండగా మలుచుకుని విలువలతో కూడిన రాజకీయాలతో సుపరిపాలన అందిస్తున్న పార్టీ బిజెపి మాత్రమే అని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కార్యదర్శి లంబ నాగరాజు, కేతోజీ మహేష్ చారి, మండల ఉపాధ్యక్షులు కొమరోజు హరికృష్ణ, తిగుళ్ల యాదగిరి, బీజేవైఎం అధ్యక్షులు నర్రా రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కుంటి బక్కుల శ్రీకాంత్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బిమరి గణేష్ ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.