18-02-2025 11:48:01 AM
హైదరాబాద్(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే(Caste Census Survey)ను రాష్ట్రాలవారీగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చెప్పాలని అడిగారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భారీగానే నిధులు విడుదల చేసిందని ఈటెల తెలిపారు. రామగుండం ఎరువుల పరిశ్రమకు రూ.6300 కోట్లు ఇచ్చిందని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్లరీ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. మేడిన్ ఇన్ ఇండియాకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు వేల కోట్ల రుణాలు ఇస్తోందని, బయ్యారం ఉక్కు పరిశ్రమను రాష్ట్రప్రభుత్వమే ఏర్పాటు చేయొచ్చు, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వమే పరిశ్రమ పెట్టవచ్చు కదా..? అని ఎంపీ ఈటెల ప్రశ్నించారు.