calender_icon.png 22 October, 2024 | 11:33 PM

ధర్మాచార్యులను బీజేపీ పట్టించుకోవట్లేదు

22-10-2024 03:10:55 AM

  1. జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి
  2. నేడు జమ్ములో గోధ్వజ్ ప్రతిష్ఠ 

జమ్ముకశ్మీర్, అక్టోబర్ 2౧: దేశవ్యాప్తం గా గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. యాత్రలో భాగంగా 29వ రోజు కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి సోమవారం పర్యటించారు. జమ్ము యాత్రను బ్రహ్మచా రి నిర్మల్ స్వరూప్ మహారాజ్ నేతృత్వంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి వారిని ఉద్దేశించి శంకరాచార్య స్వామీజీ మాట్లాడారు. ఆవు ప్రాముఖ్యాన్ని భక్తులను వివరిస్తూ గోమాతగా ఎందుకు కొలవాలో తెలిపారు. ఈ యాత్ర ఎందుకు చేపడుతున్నారో వివరించారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించేవరకు తన పోరా టం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మంగళవారం జమ్ములో గోధ్వజ్ స్థాపన చేయనున్నారు. అంతకుముందు లఢక్‌లో గోధ్వజ్ స్థాపన అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సనాతన ధార్మిక నేతృత్వం వహించేవారిని పట్టించుకోవట్లేదు. అయోధ్యలో రామమందిరం నిర్మించినప్పుడు ఎవరిని ఆహ్వానిం చారు? వారి ఇష్టప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సమాజాన్ని వంచించారు ఆరోపించారు. 

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో మొ త్తం 36 రాజధాని నగరాల్లో శంకరాచార్య స్వామీజీ పర్యటిస్తున్నారు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ యాత్రను చేపట్టారు.అయోధ్య నుంచి సెప్టెంబర్ 22న ప్రారంభమైన యాత్ర అక్టోబర్ 26న ఢిల్లీలో ముగుస్తుంది. ఆ రోజు గోవు ను రాజ్యమాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని స్వామీజీ ఇప్పటికే ప్రకటించారు.