calender_icon.png 28 December, 2024 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కమిటీలు

27-12-2024 05:52:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని గ్రామాల్లో బూత్ కమిటీ(Booth Committees)లను ఏర్పాటు చేయనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి(BJP District President Anji Kumar Reddy) అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలంలోని వివిధ గ్రామాల్లో బిజెపి(BJP) బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అయ్యగారు, భూమయ్య రావుల, రామనాథ్, రాచకొండ సాగర్, తదితరులు పాల్గొన్నారు.