హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరసన తెలుపుతామని.. బీజేపీ మహిళా నేతలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.