29-04-2025 04:41:44 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్, మున్సిపల్, ఆర్డీవో కార్యాలయాల ముందు బిజెపి శ్రేణులు ధర్నా చేశాయి. ఈ సందర్భంగా నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో అర్హులైన నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్నారు.ఈ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కౌన్సిలర్ల పేర్లు, కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉండడం శోచనీయమన్నారు.
ప్రజల పక్షాన ఉండి అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇప్పించాల్సింది పోయి వారే నిరుపేదలుగా మారి మొదటి వరుసలో ఉంటున్నారనీ విమర్శించారు. అంతేకాకుండా వారికి సంబందించిన చుట్టాలు బంధువులకి, పిఏ లకి కూడా ఇల్లు మంజూరు అవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా అనర్హులు ఎవరు ఉన్న వాళ్ల పేర్లు తొలగించాలనీ డిమాండ్ చేశారు. అదేవిధంగా వార్డుల వారీగా సమగ్రంగా సర్వే నిర్వహించి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా కార్యదర్శి కోయల్కర్ గోవర్ధన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, సీనియర్ నాయకులు జీదుల రాములు ఏల్పుల రాజయ్య, ఎస్సీ మోర్చా కార్యదర్శిలు కోడి సురేష్ కల్లెపల్లి నవీన్, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు ఉప్పులేటి స్రవంతి,పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, నాయకులు కుని రాజుల అరవింద్, ఎర్రోజు శ్రీనివాస్ చింతకింది లావణ్య, షేక్ గౌస్ బాబా పాల్గొన్నారు.