13-04-2025 01:57:20 AM
*పార్టీలో విభేదాలు లేవు.. అంతా మీడియా సృష్టే
* రాజాసింగ్‌తో భేటీ అనంతరం కేంద్రమంత్రి బండి
* దమ్ముంటే హెచ్‌సీయూ వ్యవహారంలో బ్రోకర్ పేరు బయటపెట్టాలని కేటీఆర్‌కు సవాల్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త అ ని, హిందూ సమాజ సంఘటితం కోసం పో రాడే నాయకుడని, ఆయనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని కేంద్రమంత్రి బం డి సంజయ్ పేర్కొన్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని ఆకాశ్ పురి టెం పుల్‌ను దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఆయన వరుసగా నాలుగు సార్లు గోషామహల్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మె ల్యే అని, 2018లో అసెంబ్లీలో ఏకైక నాయకుడని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆయనకు పార్టీలో ఎవరితోనూ విబేధాలు లేవని, అంతా కలిసే ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ కార్పొరే టర్లు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని.. ఎంఐఎంను గెలిపిస్తే వారి పని ఖతమవుతుందని హెచ్చరించారు.
మజ్లిస్‌కు ఓటేస్తే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదని కార్పొరేటర్లను ఉద్ధేశించి వ్యాఖ్యానిం చారు. పొరపాటున మజ్లిస్‌ను గెలిపిస్తే హిందువులంతా ఒక్కటై కార్పొరేటర్లకు రాబోయే ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తారని పేర్కొన్నారు. ఎవరికి ఓటేయాలో మీడివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందూ సమాజమంతా ఏకమై మజ్లిస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించడం తథ్యమన్నారు.
దమ్ముంటే పేర్లు బయటపెట్టు..
హెచ్‌సీయూ భూముల బ్రోకర్ ఎవరో పేరు బయటపెట్టే దమ్ములేదా అంటూ కేటీఆర్‌ను బండి సంజయ్ నిలదీశారు. నింది తుల పేర్లు బయటపెట్టకపోవడానికి కారణం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఒక్కటి కావడమేనని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై పోరాడి జైలుకు వెళ్లింది ఏబీవీపీ, బీజేపీ నా యకులేనని తెలిపారు. ప్రెస్‌మీట్లు తప్ప బీఆర్‌ఎస్ చేసిన పోరాటాలేమీ లేవన్నారు. 6 గ్యారంటీలపై అసెంబ్లీలో కొట్లాడలేని అసమర్థ పార్టీ బీఆర్‌ఎస్ అని అన్నారు. రేవం త్‌రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అందుకే రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం లో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకీ పడుతుందన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి రాజాసింగ్ సన్మానం
బండి సంజయ్‌తో పాటు వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సన్మానించారు. అనంతరం బండి సంజయ్, రాజాసింగ్ కాసేపు చర్చలు జరిపారు.