calender_icon.png 11 January, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీవి కుటిల రాజకీయాలు

09-07-2024 01:14:34 AM

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణలో టీడీపీని ముందుపెట్టి రాజ కీయం చేయాలని బీజేపీ చూస్తోందని, అం దుకు జనసేన అండగా ఉండబోతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  సంచ లన వ్యాఖ్యలు చేశారు.  ఈ మూడు పార్టీల తో బీఆర్‌ఎస్ జతకట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ఓ వైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ౪ స్తంభాలాట ఆడిందని, కూతురి బెయిల్ కోసం బీజేపీతో చేతులు కలిపి కేసీఆర్ ఆ మూడు పార్టీలకు నాలుగో స్తంభంగా మారతారా..? లేక కూతురుపై ప్రేమను కాదనుకుని బీజేపీతో విభేదించి రాజకీయాలు చేస్తారా? అనేది తేలాల్సి ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఈసారి చాలా తెలివిగా విభజన సమస్యల పరిష్కారం  పేరుతో తెలంగాణపై ఎంట్రీ ఇచ్చారన్నారు. సీఎంల భేటీని కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్థించడం ద్వారా బీజేపీ, టీడీపీ మధ్య మైండ్ గేమ్ బయటపడిందన్నారు. 

ఈడీ, సీబీఐలే బీజేపీ బలం 

ఈడీ, సీబీఐ కేసులున్న వారిని బీజేపీ లోకి చేర్చుకోబోమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులున్న వారిని బీజేపీలో చేర్చుకున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటున్న చంద్రబాబు.. హైటెక్ సిటీ సాప్ట్‌వేరు అభివృద్ధి తనదే అంటున్నార ని, కానీ కాంగ్రెస్ హయాంలోనే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి  హైటెక్ సిటీకి పునాది వేశారని గుర్తుచేశారు. సంగారెడ్డి రాజ్యానికి తన ప్రజలు మళ్లీ రాజును చేస్తారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.