calender_icon.png 20 April, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా, రాహుల్‌పై బీజేపీ కుట్ర

17-04-2025 12:00:00 AM

కాంగ్రెస్ శ్రేణుల నిరసన

ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ చార్జ్ షీట్ దాఖ లు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని బేలా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి ఆరోపించారు. ఈడీ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులు బుధవారం బేల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేషనల్ హెరాల్ మనీ లాం డరింగ్ కేసులో అగ్ర నేతలు సోనియాగాం ధీ, రాహుల్ గాంధీలను ఏ 1, ఏ 2గా చార్జిషీట్‌లో పొందుపరిచి నిందితులుగా జాబి తాను విడుదల చేయడాన్ని ఖండించారు.

ది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్ర లు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గదని తెలుసుకోవాలన్నారు.  కార్యక్ర మంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, నాయకులు రాందాస్ నాక్లే, సంజయ్ గుండావార్, వామన్ వాంఖడే, ఘన్ శ్యామ్ పాల్గొన్నారు.