calender_icon.png 1 March, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్ పేరుతో.. బీజేపీ కుట్రలు!

01-03-2025 01:08:44 AM

  1. కేంద్రంలో శాశ్వత అధికారం కోసం బీజేపీ ప్లాన్
  2. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఉన్నారు 
  3. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? 
  4. బీసీ కులగణనలో లోపాలు ఎక్కడున్నాయో చెప్పాలి 
  5. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : లోక్‌సభ నియోజకవర్గాల పున ర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది.

సీట్ల ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేపట్టాలి. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర ఇది. బీజేపీ చేస్తున్న  కుట్రలను సాగనివ్వం.. వాటిని దీటుగా ఎదుర్కొంటాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.

పీసీసీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం సీఎం గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడా రు.

బీజేపీ కూటమి అధికారంలో ఉన్న పక్క రాష్ర్టంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని, బీజే పీ అధికా రంలో ఉన్న బీహార్, యూపీ రాష్ట్రాల్లో నూ ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నా.. అక్కడ ఎందుకు రద్దు చేయించ డంలేదని ప్రశ్నించారు. ఏపీలో మీ పార్టీ పొత్తులో ప్రభుత్వం ఉన్నా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడంలేదో చెప్పాలన్నారు.

కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కులగణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం మం డిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్‌ను కేంద్రమంత్రులు కిష న్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డి మాండ్ చేయడంలేదని ముఖ్యమంత్రి నిలదీశారు.

బీసీ కులగణన లో లోపాలు ఎక్కడున్నాయో చెప్పాలని, బీసీలకు అన్యాయం చేయాల నే కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల చీకటి ఒప్పందాన్ని ఎండగడుతామని, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని సీ ఎం స్పష్టం చేశారు. 

కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నాడు.. 

రాష్ట్ర అభివృద్ధ్ది, వివిధ ప్రాజెక్టుల కోసం ప్రధాని మోదీ ఆస్తులో.. కిషన్‌రెడ్డి ఆస్తులనో అడగటం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి నే కేంద్రాన్ని అడుగుతున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు గుజరాత్ నుంచి రైళ్లలో నోట్ల కట్ట లు పంపిస్తున్నట్లుగా కిషన్‌రెడ్డి మా ట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు.

కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగిందని, కిషన్ రెడ్డి వందశాతం సైంధవ పాత్ర పోషిస్తున్నా డని సీఎం దుయ్యబట్టారు. మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారని తెలిపారు. సబర్మతిని, గంగా నదిని, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ మేం మూసీని ప్రక్షాళన చేయొద్దా? రీజనల్ రింగ్ రోడ్‌పై ఆనాడు మోడీ స్పష్టమైన ప్రకటన చేసింది నిజం కాదా? మెట్రోను కేంద్ర మంత్రివర్గ ఎజెండాలో ఎందుకు  పెట్టడంలేదు? ఎ జెండాలో పెట్టొద్దని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తోంది.

ఎవరు? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారా? మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ భయపడేవారు ఎవ రూ లేరు? మేం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం. కిషన్ రెడ్డి ఒక్కరోజైనా మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి కావలసినవి ఏమైనా అడిగారా? ఏ పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడారో చెప్పండి? ఖచ్చితంగా కిషన్ రెడ్డిది సైంధవ పాత్రనే.

కేసీఆర్ దిగిపోయారనే బాధతో కిషన్ రెడ్డి మాపై పడు తున్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. తమిళనాడుకు మెట్రోకు అనుమతిస్తారు కానీ తెలంగాణకు ఎందు కివ్వ రు? కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మె ట్రోకు అనుమతులు ఇవ్వడంలేదు.

ఎప్పటిలోగా మెట్రోకు అనుమతు లు తెస్తారో చెప్పాలి’ అని సీఎం రే వంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేం ఢి ల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయడంలేద ని, రాష్ట్రానికి కావాల్సినవి మాత్రమే అడుగుతున్నామని అన్నారు.