న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ సమావేశాలకు రావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు 'త్రీ లైన్ విప్' జారీ చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు గురువారం కేంద్ర కేబినెలట్ ఆమోదం తెలిపింది. అనంతరం రాజ్యంగ అమలుపై చర్చలున్నందున రేపు, ఎల్లుండి తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. భారత రాజ్యాంగంపై డిసెంబర్ 13-14వ తేదీలో లోక్ సభలో, డిసెంబర్ 16-17వ తేదీలో రాజ్యసభలో చర్చ జరుగనుంది. పార్లమెంట్ లోని ఉభయ సభల్లోని చర్చలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొనే అవకాశం ఉంది. రాజ్యసభలో సభానాయకుడిగా జేపీ నడ్డా, లోక్ సభలో డిప్యూటీ నాయకుడిగా రాజ్ నాథ్ సింగ్ ఉంటారు. డిసెంబర్ 14న రాజ్యాంగంపై లోక్ సభలో జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారని విశ్వసనీయ సమాచారం.