27-02-2025 12:00:00 AM
కిసాన్ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
కూసుమంచి, ఫిబ్రవరి 26 : శాసన మండలిలో పులిలా గర్జించే బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాల ని కిసాన్ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మం డలం కొత్త కొత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నిం చే గొంతుక బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్,ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు పాగతి సుధాకర్, జ్ఞాన రత్నం, సయ్యద్ మోహిద్దిన్, కళ్యాణ్ నాగేశ్వరరావు, తోగాటి నాగ చారి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.