calender_icon.png 6 March, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ కేంద్రంలో బీజేపీ సంబరాలు

06-03-2025 07:22:48 PM

చేగుంట (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మండల పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇచ్చిన హామీలను తుంగలో దొరికి అబద్దాలు ప్రచారం చేయడం వల్లనే ఈరోజు ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల ప్రజలు 33 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో, ఆరు ఎంపి స్థానాల్లో, 277 మండలాల్లో బిజెపికి స్పష్టంగా ఓట్లు వేసి కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని పట్టభద్రుల స్థానాన్ని బిజెపికి కట్టబెట్టారన్నారు.

రాబోయే కాలంలో తెలంగాణలో బిజెపి జండా ఎగరవేస్తుందని వారన్నారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్య్రమంలో మండల అధ్యక్షుడు చింతల భూపాల్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు భిక్షపతి, విహెచ్పీ ఖండ ప్రముఖ్ సురేష్, మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, టెలికం మెంబర్ బాలచందర్, నాగరాజ్, మండల ఉపాధ్యక్షుడు సాయిబాబా, ప్రధాన కార్యదర్శి నర్సింలు, సీనియర్ నాయకులు హరిశంకర్, వేను తదితరులు పాల్గొన్నారు.