06-03-2025 08:54:52 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బిజెపి నాయకులు గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించినందుకు మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల శాఖ బిజెపి అధ్యక్షులు సంతోష్ రెడ్డి నాయకులు హోటల్ శ్రీను, గంగారెడ్డి, వెంకట్రావు, తిరుపతిరెడ్డి, నర్సింలు, యాదగిరి, రాజిరెడ్డి, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.